
ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సభ
జనం న్యూస్ 06 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం (డిసెంబర్ 5, 2025)ను పురస్కరించుకొని ఐక్య తల్లిదండ్రుల సంఘం, ఉపాధ్యాయ-ఉద్యోగుల సంఘం, సంఘాల సమాఖ్యలు సంయుక్తంగా, నవ్య సాయి ప్రాజెక్టులు సహకారంతో నిర్వహించిన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు లోగాని శ్రీనివాస్ నేతృత్వంలో జరిగింది. సభ నిర్వహణ బాధ్యతలు మాళోత్ బాలు నిర్వహించారు.
ప్రముఖ అతిథులు ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపకురాలు గోపిక రత్నాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మారుతి రత్నాకర్ గౌరవ అతిథిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బిక్షపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్ మోతీలాల్, రాష్ట్ర నాయకుడు పలనాటి ప్రశాంత్ కుమార్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.గోపిక రత్నాకర్ సందేశం సంఘం వ్యవస్థాపకురాలు గోపిక రత్నాకర్ మాట్లాడుతూ— ఐక్య తల్లిదండ్రుల సంఘం ప్రజల ప్రేమాభిమానాలతో అభివృద్ధి చెందుతున్న ప్రజా సంఘం. కులం, మతం, వర్ణం, వర్గం, రాజకీయాలు, ఆర్థిక స్థితి, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సంఘంలో చేరవచ్చు. కుటుంబాల సంక్షేమం, పిల్లల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ ఈ సంఘం ప్రధాన లక్ష్యాలు అని తెలిపారు. మారుతి రత్నాకర్ సందేశం మారుతి రత్నాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సేవకులు కలిసి సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో సంఘం ముందుకు సాగుతోంది. విద్య, వైద్యం, ఉపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రజలు ఎదగాలి. అందుకోసమే ఈ సంస్థలు ఏర్పాటు చేసినాము అని పేర్కొన్నారు. సేవా గౌరవాలు ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవను అంకితభావంతో అందిస్తున్న 15కు పైగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను
‘సేవా ఉత్సవ్ – 2025’ సన్మానం చేసి ప్రశంస పత్రాలు అందజేశారు. అదే విధంగా గత సంవత్సరం సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసిన ఉపాధ్యాయ-ఉద్యోగుల సంఘం, ఐక్య తల్లిదండ్రుల సంఘం మరియు సంబంధిత సంఘాల సుమారు 50 మంది సభ్యులను సన్మానించి సేవా గుర్తింపు పత్రాలు ప్రదానం చేశారు.
సహకరించిన వారికి కృతజ్ఞతలు కార్యక్రమానికి సహకరించిన నవ్య సాయి ప్రాజెక్టులు ప్రతినిధులు
దేవర్ల రాజేష్ (రాజు) మరియు డీకొండ దుష్యంత్ కుమార్లకు సంఘం ధన్యవాదాలు తెలిపింది. పాల్గొన్న వారు
స్వచ్ఛంద సేవా సంస్థల ప్రముఖులు, ఉపాధ్యాయ-ఉద్యోగుల సంఘాల సభ్యులు, ప్రాంతీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని ప్రముఖుల పేర్లు ప్రస్తావించడం సాధ్యం కానందున మన్నింపు కోరుతున్నారు
