కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోడేటి రవి జనం న్యూస్ 2 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని టిపిసిసి మహేష్ గౌడ్ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోడేటి రవి , భీమారం మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి మాజీ జెడ్పిటిసిలు లక్ష్మణ్ నాయక్ రాజ్ కుమార్ నాయక్ మాజీ సర్పంచులు కార్యకర్తలు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపిందని ఆరోపించారు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదని ఆగ్రహం వ్యక్తం చేశారు