జనంన్యూస్. 03.
నిజామాబాదు. ప్రతినిధి. ఈరోజు 3.2.2025 నాడు సిరికొండ ఎస్సై ఎల్ రామ్. విధులలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సిరికొండలో ముగ్గురు మైనర్ అబ్బాయిలు బైక్ లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడగా అట్టి మైనర్ బాలురను మరియు వారి బైక్లను తీసుకొని వచ్చి సిరికొండ పోలీస్ స్టేషన్ నందు ఉంచి మైనర్ బాలుర తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడమైనది అంతేకాకుండా ఇప్పటినుండి సిరికొండ మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు మైనర్ బాలురకు బైక్ లు ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మరియు మైనర్ బాలుర పై, వాళ్ళ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని సిరికొండ ఎస్సై ఎల్ రామ్. హెచ్చరించనైనది.