జనం న్యూస్ 2 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారపాక రవీందర్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షునిగా మేకల రాజ కొమురయ్య ఉపాధ్యక్షులుగా మారుపాక సంపత్ మేకల వాసుదేవ్ ప్రధాన కార్యదర్శి మేకల రాజమౌళి కోశాధికారి బుగ్గ రాజేందర్ సహాయ కార్యదర్శులుగాా ఈసంపల్లి స్వామి గాజుల చిరంజీవి కార్యవర్గ సభ్యులుగా మేకల స్వామి కల్లూరు అశోక్ మార్పాక ప్రవీణ్ తదితరులను ఎన్నుకున్నారు ఈసందర్భంగా అధ్యక్షులు మేకల రాజ కొమురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఏడవ తారీకు రోజు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు