
జనం న్యూస్ 08 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలు చేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ డిసెంబర్ 7న ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా భద్రత చర్యలను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా వాహనదారులకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు వాహనం యొక్క అన్ని డాకుమెంట్స్ కలిగి ఉండాలి, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలను, ప్రమాదా లు జరిగినప్పటికీ స్వల్ప గాయాలతో ఎలా ప్రాణాలతో భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలన్నారు. ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగును నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భదత, మోటారు వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాని అధికారులకు ఆదేశాలు జారిచేశారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు చేయాలన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్‌కు ఇరువైపుల కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించాలన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలుపై ఇతర లైన్ డిపార్టుమెంట్స సహకారంతో నివేదిక తయారు చేసి తన కార్యాలయంకు పంపితే, వాటిని కలెక్టరు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఎన్ఫోర్సుమెంటు వర్కులో భాగంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై 19,077 కేసులు, సెల్ ఫోను వినియోగిస్తూ వాహనాలను నడిపే వారిపై 2370 కేసులు, మైనర్లు వాహనాలను నడిపిన కారణంగా వాహన యజమానులపై 1020 కేసులు, డ్రంకన్ డ్రైవ్ చేసి పట్టుబడిన వారిపై 5510 కేసులు, గడిచిన 20 రోజులలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 45 మందికి జైలు శిక్ష కూడా పడిందన్నారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 17,246 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.