
జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో కన్నె స్వామి ముల్కనూరు సంజయ్ స్వామి ఇంట్లో గురుస్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో పూజను వైభవంగా నిర్వహించినారు. అయ్యప్ప స్వామి పూజను వేదమంత్రాల మధ్య వినాయకుడు కుమారస్వామి లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి అష్టోత్తరాలతో శరణు ఘోషతో అయ్యప్ప పూజను నిర్వహించినారు. అయ్యప్ప భజనలతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించినారు. ఈ పూజా కార్యక్రమంలో గురు స్వాములు వినుకొండ రాజ్ కుమార్ ఉప్పు నరసయ్య లోకల బోయిన కుమారస్వామి బాసని బాలకృష్ణ కొత్తపెళ్లి రవీందర్ బూర రవీందర్ మార్త సుమన్ గట్టు కిషన్ సామల నాగరాజు వనం విశాల్ కోమటి రవి కమల్ ఉజ్జేతుల శ్రీకాంత్ మురళి సత్యం శ్రీధర్ హరీష్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు....