
జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం బడుగు, బలహీన వర్గాలకు గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతల రవిపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. గ్రామాల్లో కుల, మత అనే బేధాలు లేకుండా అందరూ సమానమే అనే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. భారతీయులకు ఆరాధ్యుడు బీ.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత భారతదేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దామెరకొండ కొమురయ్యా, రాజ్ మహ్మద్, విజయ, రాజు పాల్గొన్నారు.....