
డిసెంబర్ 8 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం
మహ్మదాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆధ్వర్యంలో సోమవారం రోజు గ్రామంలో భారీ స్థాయిలో చేరికలు చోటుచేసుకున్నాయి.ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హన్మంత్ షిండే నాయకత్వంపై విశ్వాసం ఉంచి, అభివృద్ధి మార్గంలో భాగస్వామ్యం అవ్వాలని సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పించుకొని చేరికయ్యారు.హన్మంత్ షిండే మాట్లాడుతూ—ప్రజల ఆశయాలు నెరవేర్చే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేఅభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వమే ప్రజలకు కావాలిజుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతున్నామని తెలిపారుచేరికల సందర్భంగా గ్రామంలో జోష్, ఉత్సాహం నెలకొంది. నూతనంగా చేరిన కార్యకర్తలు షిండే కి కృతజ్ఞతలు తెలియజేస్తూ—“జుక్కల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ గెలవాలి… ముందుకు సాగాలి” అనే నినాదాలతో మార్మోగించారు.

