
జనం న్యూస్ డిసెంబర్ 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరించడంతో స్వచ్చ అటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూకట్ పల్లి జోన్ చైర్మన్ గా ఎత్తరి రమేష్ ను నియమించడం జరిగింది.
ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ స్వచ్చ అటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి సోమవారం నాడు జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ లో గల జీహెచ్ఎంసీ స్వచ్చ అటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో కూకట్ పల్లి జోన్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో కమిటీ చైర్మన్ ఎత్తరి రమేష్ ను నియమించి నియామక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి చైర్మన్ సత్యా రెడ్డి,నిజాంపేట సర్కిల్ కన్వీనర్ మల్లికార్జున, కార్మికుల నేతలు బి.కుమార్,ప్రశాంత్,అంజి,సుంకయ్య,తదితర ప్రముఖులు పాల్గొన్నారు.