
చివరి నిమిషంలో లక్ష్మణరావు నామినేషన్ వెనక్కి – అర కోటి రూపాయల లావాదేవీల చర్చలు గ్రామంలో హాట్ టాపిక్
జనం న్యూస్,08 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం )
చుంచుపల్లి మండలానికి చెందిన విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఊహించని మలుపు తీసుకున్నాయి.గ్రామంలో ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణరావు అకస్మాత్తుగా తన సర్పంచ్ నామినేషన్ను వెనక్కి తీసుకోవడం స్థానికంగా సంచలనానికి దారితీసింది.ఇద్దరు అభ్యర్థులతో సాగిన ఎన్నికల పోరు సర్పంచ్ స్థానానికి ఈసారి కేవలం ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకరు సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి మరొకరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణరావు రెండు పార్టీల మద్య నేరుగా పోటీ నెలకొన్న సమయంలో, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకోవడం వల్ల ఎలాంటి పోటీ లేకుండా సిపిఐ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైంది.
విద్యానగర్ కాలనీ ప్రజల్లో తీవ్ర నిరాశ ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గ్రామాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది”,“కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం లక్ష్మణరావు నామినేషన్ వెనక్కి తీసుకోవడం వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ అలజడి నెలకొంది.స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ నిర్ణయం వల్ల తీవ్ర నిరాశతో ఉన్నారని తెలుస్తోంది.“ఎందుకు వెనక్కి తగ్గారు?”, “ఎవరి ఒత్తిడికి లోనయ్యారు?”, “ఏ రాజకీయ ఒప్పందం జరిగింది?” అనే ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతున్నాయి.
అర కోటి రూపాయల లావాదేవీపై గ్రామంలో పెద్ద చర్చ గ్రామస్థులు మరియు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం,ఈ నామినేషన్ వెనక్కి తీసుకోవడం వెనుక దాదాపు అర కోటి రూపాయల వరకు భారీ ముడుపుల వ్యవహారం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం.అన్నీ ప్రజల మద్య వినిపిస్తున్న చర్చలే. ప్రజలు డిమాండ్ – నిజాలు బయటపడాలంటూ విద్యానగర్ కాలనీ ప్రజలు ఈ ఘటనపై స్పష్టమైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తాయి.” “గ్రామ భవిష్యత్తు కోసం పోటీ చేసిన వ్యక్తి ఇలా వెనక్కి తగ్గడం అర్థం కావడం లేదు.”“నిజాలు బయటకు రావాలి” అని గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.విద్యానగర్ కాలనీ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది లక్ష్మణరావు నామినేషన్ వెనక్కి తీసుకోవడంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సర్పంచ్ కుర్చీపై సిపిఐ అభ్యర్థి ఏకైక పోటీలో ముందుకు సాగగా,గ్రామ ప్రజలు మాత్రం ఈ ఒక్క నిర్ణయం తీసుకొచ్చిన కలకలంపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో ఈ ఘటన, రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ చర్చలు, ఆరోపణలు తెరపైకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.