
(జనం న్యూస్ 8 అక్టోబర్ డిసెంబర్, భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి)
భీమారం మండలం కాజిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన, గ్రామపంచాయతీ వర్కర్ జాగటి శంకర్ తండ్రి దుర్గయ్య వయసు 43 సంవత్సరాలు కులం మాదిగ అనే వ్యక్తి తన కుటుంబ అవసరాల నిమిత్తము చేసిన అప్పును తీర్చలేక మనస్థాపం చెంది నిన్నటి రోజు అనగా తేదీ 7.12. 2025 నాడు ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రి లో ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి అక్కడే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ ఈరోజు తేదీ 8.12.2025 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందినాదని మృతుని భార్య రజిత ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమైనది. కాగా మృతునికి ఇద్దరు కుమార్తెలు, సుస్మిత సుస్మిత,లల్లి కలరు.