
జనం న్యూస్ డిసెంబర్ 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండలం లోని కోతుల నడుమ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తు విపరీతమైన ఊపద్దుకుంది సర్పంచ్ అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ న్యాయవాది గ్రామంలో విస్తృతంగా చేపట్టిన ప్రచారానికి ఓటర్ల నుంచి విశిష్ట స్పందన కాల్ నడకన ప్రతి ఇంటి సందర్శించిన ఎర్రోళ్ల రమేష్ గ్రామస్తులు నీరజనాలు పలుకుతున్నారు. అభ్యర్థి రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని బ్యాట్ గుర్తుకు మీ విలువైన ఓటు వేసి నన్ను విజేతగా నిలబడాలని కోరారు అభివృద్ధి గ్రామ రహదారులు పరిశుభ్రత కాలువలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా వ్యవస్థ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రావడానికి కృషి చేస్తాను గ్రామాన్ని సస్యశ్యామలంగా ఇలా అనేక సమస్యలు పరీక్షిస్తానని తెలిపారు ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటానని కుటుంబ సభ్యుడిగా ఉంటానని ప్రతి ఇంటికి అభివృద్ధి కల్పించాలని దానికోసం కృషి చేస్తానని హామీలు ఇచ్చారు ఒక్క అవకాశం ఇస్తే కోతల నడుమ గ్రామాన్ని మరింత అభివృద్ధి దశగా తీసుకెళ్తానని అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ న్యాయవాది అన్నారు. కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు