
జనం న్యూస్ 09డిసెంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామానికి చెందిన పలుమారు అంజయ్య యాదవ్ ను యాదవ చైతన్య వేదిక ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అడితం మహేందర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు తమ్మినేని రవి యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో అంజయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని తెలిపారు. అదేవిధంగా బీసీలను సంఘటన పరిచి చట్టసభలలో రిజర్వేషన్లు సాధన కోసం కృషి చేస్తానని తెలియజేశారు.