
జనం న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
కేంద్రంలో మంగళవారం నాడు తుంగతుర్తి మాలంగి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా విజయ్ దివాస్ నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివాస్ గా ఘనంగా నిర్వహించుకోవాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నేడు నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణితో కలిసి ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.