
జనం న్యూస్ 09 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ ప్రాంతాల్లో పాగుంట, బూరెడ్ది పల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న... యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*జోగులాంబ గద్వాల జిల్లా:* గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేసి దోపిడీ పాలనకు స్వస్తి పలికి నిజాయితీ పాలనను అందించే అభ్యర్థులను గెలిపించాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ కోరారు. మంగళవారం కె.టి.దొడ్డి మండలం పాగుంట ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బలపర్చిన గ్రామ సర్పంచ్ అభ్యర్థులు తులసి, వీరేష్ లకు మద్దతు తెలుపుతూ గ్రామాలలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....గ్రామ అభివృద్ధి మార్పుకోసం, గ్రామ ప్రజలు యువత ఐక్యమత్యమై, భారత రాజ్యాంగ నిర్మాత.మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన అమూల్యమైన ఓటును గ్రామ సమస్యలపై నీతి, నిజాయితీగా పోరాడే నాయకులను మీ ఓటు హక్కు ద్వారా గ్రామ సేవకుడిగా సేవ చేసేవారిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని స్పష్టం చేశారు. మద్యం,డబ్బు వంటి ప్రలోభాలకు లొంగి మన జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు, మల్దకల్, సుదర్శన్, స్వామి,రామప్ప, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.