
సోషల్ మీడియాలో టైం వెస్ట్ చేయొద్దు:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
జనం న్యూస్ డిసెంబర్ 09 సంగారెడ్డి జిల్లా
విద్యార్థులు చిన్నతనం నుంచి కష్ట పడి చదివి తల్లిద్రండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొనిరావాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లో నూతన లైబ్రరీని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయం లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎంఈఓ రాథోడ్, పలువురు నాయకులు ఉన్నారు.