
జనం న్యూస్ డిసెంబరు 9, శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం దేశ ప్రధాని పీఠం అధిరోహించే అవకాశం ఉన్నప్పటికీ పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహా నాయకురాలు సోనియా గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం మండలం అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ సహకారంతో యూపీఏ హయంలో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ముగింపు పలుకుతూ సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి (బుజ్జి అన్న) రవీందర్ నాయకులు చిందం రవి బసాని శాంత రాజు రవిపాల్ కట్టయ్య రాజేందర్ శంకర్ చారి బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ దామర కొండ కొమురయ్య పలుపదాసు రాము తదితరులు పాల్గొన్నారు.