
జనం న్యూస్ 09 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం)
కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ యువతీని మోసం చేసిన కేసులో వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల గ్రామం యువతి 2023 నవంబర్ 16 న తన ఫిర్యాదు లో అదే గ్రామానికి చెందిన జవ్వాజి జోషి కిరణ్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని తదుపరి తనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకో గా ప్రెగ్నెన్సీ వచ్చినదని తనను పెళ్లి చేసుకోమనగా నిరాకరించాడని పెద్దమనుషుల పంచాయతీ పెట్టించగా తాను నేరం అంగీకరించి,నేను చేసింది వాస్తవమే కాని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నా, అని బూతులు తిట్టిచు, నీ దిక్కున చోట చెప్పుకో తనను చంపేస్తానని బెదిరించగా గుండాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా అప్పుటి సబ్ ఇన్స్పెక్టర్ క రాజశేఖర్ కేసు నమోదు చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎల్ రవీందర్ దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు .కోర్టులో పదిమంది సాక్షులను విచారించారు. కాస్ట్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి నిర్వహించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ డి రాఘవయ్య కోర్టు లైసెన్ ఆఫీసర్ ఇన్ వీరబాబు కోర్టు డ్యూటీ ఆఫీసర్ పిసి మహమ్మద్ మహమూద్ పాష లు సహకరించారు