
జనం న్యూస్ 10 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో 54 వేల మంది సంతకాలు సేకరణ చేసినట్లు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైద్య విద్యా రంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందన్నారు.కూటమి ప్రభుత్వం పేదలకు విద్యా, వైద్యం అందకుండా చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు.