
జనం న్యూస్ 10డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జిల్లా కలెక్టర్ ని కలిసిన టియుడబ్ల్యూజే బృందం ఆసిఫాబాద్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులకు ఎన్నికల పాసు లు జారీ చేయాలని బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కీ టీయూడబ్ల్యూజే (ఐజెయు) బృందం కోరింది. ఈ సందర్భంగా టియూడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి నూతన అక్రిడేషన్ కార్డులు జారీ కాకపోవడంతో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు లేవన్నారు. ఎన్నికల వార్తలు కవరేజ్ కోసం అక్రిడేషన్ తో సంబంధం లేకుండా పాసులు జారీ చేయాలని కోరడంతో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే స్పందిస్తూ జిల్లాలోని జర్నలిస్టులు అధికార యంత్రంతో సమన్వయంతో పనిచేస్తున్నారని, అక్రిడేషన్ కార్డులు లేని వర్కింగ్ జర్నలిస్టులకు ఎన్నికల పాసులు జారీ విషయంలో కమిషనర్ తో మాట్లాడతానని తదుపరి ఎంపీడీఓ లకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే ( ఐజెయు ) జిల్లా కోశాధికారి ఆడప సతీష్ , జిల్లా నాయకులు సురేష్ చారి తదితరులు ఉన్నారు.