
జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఐ పోలవరం మండలం ఐ పోలవరం హైస్కూల్ సెంటర్లో ఈరోజు ఉదయం ముమ్మిడివరం ఖండ సంఘచాలక్ ఆధ్వర్యంలో 14/12/2025 ఆదివారం రెండు గంటలకు మధ్యాహ్నం జరుగు హిందూ సమ్మేళనం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సాగి శ్రీనివాసరాజు (బాపిరాజు)మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనము నిర్వహించడం జరుగుతుంది సమాజంలో హిందువులను చైతన్య పరచడం హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేయడం జరుగుతోంది. కావున ప్రతి గ్రామం నుండి మన హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో రాయపురెడ్డి రామ బ్రహ్మానందరావు(చిట్టిబాబు) సానబోయిన రాంబాబు బొంతు వంశీ విత్తనాల శ్రీనివాసరావు పేరాబత్తుల రామకృష్ణారావు ఏలూరు రాంబాబు సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు..