
జనం న్యూస్ 10డిసెంబర్. కొమురంభీమ్ జిల్లా
. జిల్లా స్టాఫ్ఫర్.రేపు జిల్లా పరిధిలోని కేరమేరి,వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యు) మండలాలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పోలింగ్ కేంద్రాలు మరియు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి జిల్లా ఎస్పీ నితిక పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ బాంబు డిస్పోజల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.ఎన్నికల ముందు భద్రతా పరిస్థితిని సమగ్రంగా సమీక్షిస్తూ, పోలింగ్ కేంద్రాలు, రూట్ మ్యాపులు, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్లు, మార్కెట్ యార్డులు, గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాంబు డిస్పోజల్ టీమ్ సిబ్బంది అనుమానాస్పద వస్తువులను గుర్తించే విధానం, భద్రతా ప్రోటోకాలు మరియు అత్యవసర స్పందన చర్యలను సమీక్షించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ—ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, రూట్ మొబైల్ టీమ్స్ నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు, ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నామని ఎస్పీ తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడరాదని, జిల్లా పోలీసులు ఎన్నికల భద్రతాపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలిపారు.
