
జుక్కల్ డిసెంబర్ 10 జనం న్యూస్_కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులందరూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు పొందారు..__ఎమ్మెల్యే వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.. గ్రామాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు..__ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల వివరాలు:__బిజ్జల్వాడి గ్రామం – గంగు బాయి __బంగారుపల్లి గ్రామం – _గాయబాయి మాణిక్ రావు __చిన్న గుల్ల గ్రామం – గ్యానేశ్వర్ __మథురి తండా – అనిత మోహన్ __దోస్త్ పల్లి గ్రామం – మారుతి మరియు పిట్లం మండలం గౌరారం తండా నరేంద్ర సింగ్ _ఏకగ్రీవ ఎన్నికలు గ్రామాల్లో ఐక్యత, అభివృద్ధి పట్ల ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు..__ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఎమ్మెల్యే నూతన సర్పంచ్ లకు సూచించారు..__స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్పంచులపై నమ్మకం వ్యక్తం చేశారు.._


