
జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం
ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి 60,000 సంతకాలు ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు* *మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసి సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో ముమ్మిడివరం పార్టీ ఆఫీస్ దగ్గర ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించి అక్కడి నుండి అమలాపురం లో మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ వారి ఇంటి వద్దకు ఆయనే ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్లడం జరిగింది**ఈ కార్యక్రమంలో సీఈసీ నెంబర్ పితాని బాలకృష్ణ , ముమ్మిడివరం మున్సిపల్ చైర్మన్ , ఎంపీపీలు, జడ్పిటిసిలు, పార్టీ నాలుగు మండలాల మరియు టౌన్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర స్థాయి నాయకులు,ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మరియు అనుబంధ విభాగ అధ్యక్షులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు
