
(జనం న్యూస్ 11 డిసెంబర్ ప్రతినిధి, భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి)
భీమారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.గ్రామం లో వాడ వాడలా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి బాటలో ఉంచుతానన తెలిపారు. గ్రామంలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడతానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనుల మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తున్నారు.
