
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అల్ హాది వెల్ఫేర్, హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సహకారంతో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ దినోత్సవాన్ని పురస్కరించు కొని, కడప నగరం నందు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ-కడప వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు కార్యక్రమంలో, విద్యార్థులను ఉద్దేశించి జాతీయ దివ్యాంగ భారత క్రికెట్ క్రీడాకారుడు అలుసూరి శివకోటి ప్రసంగిస్తూ, క్రీడలు అనేవి ప్రతి ఒక్క విద్యార్థి మరియు యువత జీవితాల్లో ఆత్మ విశ్వాసాన్ని, మనోస్థైర్యాన్నీ మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి అని అన్నారు.అలాగే క్రీడల పట్ల మక్కువతో,ఏకాగ్రతతో మీ ముందున్న లక్ష్యాన్ని చేధించడంలో కష్టపడి పని చేస్తే, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన విద్యార్థులకు, యువతకు పలు కీలక సూచనలు, సలహాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అలుసూరి శివకోటిని విద్యార్థులు, మేధావులు, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ కమిటీ మరియు అల్ హాది వెల్ఫేర్ హ్యుమన్ రైట్స్ ఫెడరేషన్ అసోసి యేషన్ వారంతా జాతీయ స్థాయిలో క్రీడల్లో భారత దేశానికి వివిధ సేవలందించిన శివకోటిని ఘనంగా సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.