
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 11తర్లుపాడు
మండలంలోని చెన్నారెడ్డి పల్లె పంచాయతీలో నవంబర్ 29 న రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గ్రామ పర్యటన సందర్భంగా, ఎమ్మెల్యే ప్రధాన రహదారి పై మురుగునీరుప్రవహిస్తుండటం గమనించారు. ఈ పరిస్థితి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే,పారిశుద్ధ్యందారుణంగా ఉందని, మురుగునీరు నిలబడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్ఛార్జి ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి గీత దగ్గర ఉండి పనులు పర్యవేక్షించారు. తక్షణమే మురుగు నీరు సక్రమంగా పోయే విధంగా కాలువలు తీపించారు.ఈ పారిశుద్ధ్య చర్యలతో పాటు, గ్రామంలో హౌసింగ్ సంబంధించిన కార్యక్రమం మరియు ఓహెచ్ఆర్ట్యాంకును శుభ్రం చేయుట కూడా జరిగింది. అంతేకాకుండా, దోమల నివారణకు గాను పరిసర ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించడం వంటి పనులు చేపట్టారు.ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చొరవ మరియు తక్షణ చర్యల కారణంగా గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడటం పట్ల చెన్నారెడ్డి పల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో హౌసింగ్ ఏఈ నిర్మల్ బాబు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ కరీముల్లా పాల్గొన్నారు
