
జనం న్యూస్ డిసెంబర్ 11మాడిగి
గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ వేడి చెలరేగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ సర్పంచ్ అర్షద్ జామ పటేల్ మళ్లీ బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే తమ లక్ష్యమని అర్షద్ జామ పటేల్ తెలిపారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం గ్రామం కోసం మరింత ఉపయోగపడుతుందని అన్నారు.గ్రామ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తూ, ప్రతి ఇంటికీ వెళ్లి తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.