
జనం న్యూస్ 12 డిసెంబర్
శేరిలింగంపల్లి లోని మసీద్ బండ గ్రామం నాటి ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టు గా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కీ || శే సత్యనారాయణ పరమపదించి నేటి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి తనయులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో వారి ఆశయ సాధనకు ద్వితీయ కుమారుడు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ క్రియాశీల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్న సేవలు విదితమే. వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోదరుడు శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎం. భిక్షపతి యాదవ్ తో పాటు వివిధ రంగాలలోని పలువురు ప్రముఖులు హాజరై నివాళులు ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మీడియా తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సత్యనారాయణ సేవా సమితి పేరున తాను చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను వివరించారు. సత్యనారాయణ భౌతికంగా మనకు దూరమైన ప్రజల సత్తన్నగా కుమారుడిగా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు.