
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు: దివ్యాంగులని చిన్న చూపు చూడకుండా వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లోనూ రాణిస్తారని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ ,నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు గంగనపల్లి వెంకటరమణ లు తెలిపారు. శుక్రవారం నాగిరెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాల ఆవర ణంలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి దివ్యాంగ పిల్లల్లోనూ ప్రత్యేక నైపుణ్యత దాగి ఉంటుందని దానిని తల్లి దండ్రులు గుర్తించి ప్రోత్స హించి తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లలకు ఉప కరణాలు,రవాణా బత్యం, స్టైఫండ్, ఎస్కార్ట్ అలవెన్స్, చిన్నపాటి శాస్త్ర చికిత్సలు లాంటి కార్యక్రమాలు చేపడు తుందని వీటిని సద్విని చేసుకొని తమ పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు కృపానందం, జాతీయ వికలాంగ క్రికెటర్ శివకోటి, ఫిజియోథెరపిస్ట్ ఉమా మహేశ్వరరావు సహిత ఉపాధ్యాయులు రంగస్వామి, వసుంధర,తల్లిదండ్రులు పాల్గొన్నారు.