
జనం న్యూస్ 13 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు.కాంగ్రెస్ , టిఆర్ఎస్ పార్టీ లకు ఓటు అడిగే హక్కే లేదు..
ఈ రోజు మల్దకల్ మండలం మల్దకల్ లో దామ పద్మావతి వెంకటేష్,మద్దెల బండ గ్రామం లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాంబాబు గెలిపించాలని ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.గ్రామల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వా నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చింది లేదని అన్నారు..గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు ఓటు అడిగా హక్కు లేదని గతంలో గ్రామ పంచాయతీ లకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వక సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు..గ్రామాల్లో సిసి రోడ్లు, వీధి లైట్లు, వైకుంఠధామాలు ,రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, మరుగుదొడ్లు ఇలా అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతున్నాయని అన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.రోడ్లు చెడిపోయాయి, నీటి సమస్యలు ఎక్కువయ్యాయి, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా సరైన రీతిలో వినియోగించడంలో విఫలమైంది.ప్రజలు మోసపోవడం ఇక చాలు. నిజమైన అభివృద్ధి కావాలంటే బీజేపీకే అవకాశం ఇవ్వాలి. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి” అని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అక్కల రమాదేవి,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత మధు గౌడ్,జిల్లా కార్యదర్శి మంజుల నరసింహశెట్టి,మహిళ మోర్చా నాయకులు .భారతి ,భారతి, వీరన్న గౌడ్, లక్ష్మీ నారాయణ,తిమ్మప్ప, వెంకటేష్,తిమ్మప్ప,తిరుమలేష్ ,జయన్న, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు..