
జనం న్యూస్ డిసెంబర్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సార్వత్రిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చండూరు గ్రామానికి వచ్చారు చండూరు గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నిరుడి దేవదాస్ ను గెలిపించాలని కోరారు అలాగే అన్ని వార్డులు గెలిచే విధంగా కార్యకర్తలు కష్టపడాలని సూచించారు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బస్సు ప్రయాణం ఒకటే అమలయిందని తెలియజేశారు మిగతావన్నీ తుంగలో తొక్కేశారు అని తెలియజేశారు బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పలు కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి చెందాయని తెలియజేశారు చండూర్ బి ఆర్ ఎస్ గ్రామ సర్పంచ్ నీరుడు దేవదాసుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా వార్డు మెంబర్లు ప్రతి ఒక్క కార్యకర్త టిఆర్ఎస్ కోసం పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి నరేందర్ రెడ్డి కిషన్ రెడ్డి రాజిరెడ్డి జయరాం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ నరేష్ పంతులు కాసిం భూపాల్ నాందేవ్ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్య కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు