
ప్రచారంలో పాల్గొన్న రఘువీరారెడ్డి
జనం న్యూస్ డిసెంబర్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బిజెపి పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉప్పలగళ్ల రమేష్ ని గెలిపించాలని కోరారు ప్రచార కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు ప్రచారంలో వార్డు సభ్యులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఆశతో కాదు ఆశయంతో వస్తున్నాం అని పిలుపునిచ్చారు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రత్యేకంగా వారు ఒక మేనిఫెస్టోను తయారు చేశారు తాగునీరు కోసం మూడు బోర్లు వేసి 24 గంటలు నీరు సరఫరా అందించడం కోసం మినీ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం గ్రామ యువకుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు గెలిచిన 6 నెలల సమయంలో వైకుంఠ రథం అందజేస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం అలాగే గ్రామంలో ఆడబిడ్డ పుడితే సుకన్య సమృద్ధి యోజన పథకం ఫ్రీగా అమలు చేస్తామని తెలియజేశారు యువకులుగా వస్తున్నాం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాం అని తెలియజేశారు ఓటర్ మహాశయులకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు