
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్,ఎస్) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు,ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ పార్టీ నాయకులు రాచూరి మురళి,వీరబల్లి జయ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు, జనం న్యూస్ పత్రిక విలేఖరి కిరణ్ కలిసి ఈ బస్సు సేవలను తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ని కోరారు.వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సాయి లోకేష్ వెంటనే ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లత సమస్యపై స్పందిస్తూ, టంగుటూరు–రాజంపేట రూట్ బస్సును నందలూరు ఆర్ఎస్ రోడ్డు మీదుగా నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు.దీంతో ప్రజలకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా రాజంపేటలోవిద్యనభ్యసిస్తున్న కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులకు ఈబస్సుఎంతో ఉపయోగకరంగామారనుంది. ఉదయం 8 గంటల సమయంలో నందలూరు ఆర్ఎస్ రోడ్డు ఆర్ & బి బంగ్లా వద్ద ఈ బస్సు రాజంపేటకు ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎన్డీఏ నాయకులు తెలిపారు.ఈరోజు ఉదయం 8 గంటలకు ఆర్, ఎస్ అరవపల్లి అండ్,బి బంగ్లా వద్ద చేరుకున్న బస్సు,బస్సు డైవరు మరియు కండక్టర్ ను ప్రజా ప్రతినిధులు మిఠాయిపంచిశాలువాతోసత్కరించారు.నందలూరు ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కి స్థానిక నాయకులు,ప్రజలు ప్రత్యేకకృతజ్ఞతలుతెలియజేశారు.ఈ నిర్ణయంతో నందలూరు మండల ప్రజల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవు తున్నాయి.
