
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15 డిసెంబర్
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బోయిని రాజు ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల విస్తృత మద్దతుతో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషం.ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శక పాలనకు కట్టుబడి ఉంటానని బోయిని రాజు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన మాటలకు ఆకర్షితులైన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఓటు వేసి గెలిపించారు.గెలుపు అనంతరం గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. బోయిని రాజును అభిమానులు, గ్రామ పెద్దలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపు గ్రామ ప్రజల విజయమని, అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.