
జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ డిసెంబర్ 15
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్రావ్ పేట గ్రామంలో సోమవారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సర్పంచులను మండలం లోని హిమ్మత్రావుపేట గ్రామానికి చెందిన మల్యాల అనసూర్య, తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన ల్యాగల రాజేశం, నరసింహ పల్లి గ్రామానికి చెందిన ఉక్కురి అర్చన, శనివారం పేట గ్రామానికి చెందిన గోలి ఐలయ్య, శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కోరండ్ల స్వప్న,అలాగే ఏకగ్రీవంగా ఎన్నిక అయిన చింతలపల్లి గ్రామానికి చెందిన ఎలకపల్లి సుమలత గార్ల తో పాటు హిమ్మత్రావుపేట, నరసింహులపల్లి, చెప్యాల గ్రామాలకు చెందిన ఉప సర్పంచ్ లు ఎన్నికైన పునుగోటి కృష్ణారావు, జిల్లెల నరేష్, జిడిగె సాయి లను సోమవారం రోజున మాజీ జెడ్పిటిసి దంపతులు మునుగోటి ప్రశాంతి కృష్ణారావు, బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి, స్వీట్లు తినిపించి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు..వారి వెంటమల్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరండ్ల నరేందర్ రెడ్డి నాయకులు బండ పెళ్లి అంజన్ కుమార్,దుబ్బాక శ్రీనివాస్, ఆకునూరి మల్లయ్య, ఏగుర్ల తిరుపతి, మల్యాల మహిపాల్ డేవిడ్ సోలమాన్,తదితర నాయకులు ఉన్నారు..