
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేఖ శివాజీ బోస్లే పాటిల్ ప్రచారం చేస్తూ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే డోంగ్లి అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామంలో ఉన్న త్రాగునీటి , డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ 17వ తేదీ ఓటింగ్ రోజు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. వీరితోపాటు మాజీ సర్పంచ్ మహానంద మహిళలు తదితరులు పాల్గొని సర్పంచిగా రేఖ శివాజీ పటేల్ గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

