
జనం న్యూస్ డిసెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పడి పూజను బసాని మల్లయ్య గృహంలో వరంగల్ హరి హర క్షేత్ర అర్చకులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించిన మండపంలో వినాయకుడు లక్ష్మీదేవి అయ్యప్ప పటాలను అలంకరించినారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించినారు అయ్యప్ప శరణు ఘోషతో భజనలతో గ్రామమంతా మారు మోగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ పూజా కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ గురు స్వామి సామల బిక్షపతి జిన్నా శ్రీనివాస్ రెడ్డి నామని శివ పూర్ణాచారి గోపి కందగట్ల రమేష్ వినుకొండ రాజ్ కుమార్ మార్త సుమన్ గట్టు కిషన్ బసాని బాలకృష్ణ కుమారస్వామి రవీందర్ నాగరాజు విశాల్ శ్రీధర్ హరీష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..