
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అని నడవపల్లి పంచాయతీ మెంబర్ గ్రంధి నానాజీ పేర్కొన్నారు,సోమవారం నడవపల్లి పంచాయతీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అని నానాజీ అన్నారు,తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి,ప్రాణాలర్పించిన అమరజీవి,తెలుగు ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచారన్నారు,చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లవి వెంకటరావు,పంచాయతీ కార్యదర్శి సురేష్,నాయకులు బొమ్మిడి దుర్గా మల్లేశ్వర రావు, మల్లాడి వెంకటేశ్వర రావు,మోటేపల్లి నాని, దొమ్మేటి గోపాల్,గ్రామ రెవెన్యూ అధికారి
వాండ్రాపు రామకృష్ణ పంచాయతీ మరియు సచివాలయం సిబ్బంది తదితరులున్నారు
