
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం పట్టణంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జి.ఎం.కె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త గుత్తుల మీరాకుమార్ భారీ విరాళం అందజేశారు. కళ్యాణ మండప నిర్మాణానికి తోడ్పాటుగా ఆయన ప్రకటించిన రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) విరాళాన్ని ఆదివారం సాయంత్రం ముమ్మిడివరంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా నిర్మాణ కమిటీకి అందజేశారు. సమాజాభివృద్ధి, సామాజిక సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జి ఎం కె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని అందించడం హర్షణీయమని సంఘ పెద్దలు కొనియాడారు. శెట్టిబలిజ కళ్యాణ మండపం పూర్తయితే, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విరాళం అంద చేసేందుకు హైదరాబాద్ వాస్తవ్యులు, GMK చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పిల్లి నాగబాబు, ట్రస్ట్ సభ్యులు వాసంశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ముమ్మిడివరం వచ్చి, 14-12-2025 ఆదివారం సాయంత్రం నగదును నిర్మాణ కమిటీకి అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుత్తుల సాయి, దొమ్మేటి రమణ కుమార్, దొమ్మేటి అప్పారావు, సానబోయిన మల్లిఖార్జునరావు, పితాని బాలకృష్ణ, గుబ్బల రవి , వంతు బుజ్జిబాబు, కట్ట సత్తిబాబు, సానబోయిన చిన్న బాబు, రెడ్డి సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు. అలాగే సంఘ పెద్దలు, సంఘీయులు పెద్ద సంఖ్యలో హాజరై, విరాళం అందించిన గుత్తుల మీరాకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
విరాళం అందించినందుకు సంఘం తరఫున ట్రస్ట్ చైర్మన్కు ఘనంగా సన్మానం నిర్వహించారు, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని గుత్తుల మీరాకుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విరాళంతో శెట్టిబలిజ కళ్యాణ మండప నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి అవుతాయని నిర్మాణ కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
