
జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని శాయంపేట గ్రామ మాజీ సర్పంచ్, శాయంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమౌళి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బసాని శాంత - రవి కు తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వలుపదాసు చంద్ర మౌళి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర చారి బసాని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు….