
జనం న్యూస్ 16 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వ తేదీ వరకు విశాఖలో సీఐటీయూ అఖిల భారత మహాసభలు జరగనున్నట్లు అసంఘం నాయకులు రెడ్డి శంకరరావు తెలిపారు. సోమవారం విజయనగరంలో జరిగిన పతాక ఆవిష్కరణలో ఆయన మాట్లాడుతూ..ఈ మహాసభలకు దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ సభల్లో కార్మిక చట్టాలు, హక్కులు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలియజేశారు.