
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
.అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ మౌంట్ కార్మెల్ పాఠశాల నందు శక్తి టీం అవగాహనసదస్సునిర్వహించారు.ఈసందర్భంగా ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించారు. అపరిచితులకు దూరంగా ఉండాలని తెలియ జేశారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లవలసిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చుఅన్నారు మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ ఒక ఆయుధం గా పని చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సిబ్బంది,పోలీసులు,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.