
జోనల్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి, స్టేజ్ టు ఆఫీసర్ గుండు హనుమండ్లు,
జనం న్యూస్,డిసెంబర్ 16,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న జోనల్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి, మాట్లాడుతూ స్టేజ్ టు ఆఫీసర్ గుండు హనుమండ్లు,తో పాటు సిబ్బందిని తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మూడో విడత స్థానిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో స్థానిక ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందిని మంగళవారం ఎన్నికల సామాగ్రితో తడ్కల్ గ్రామనికి చేరుకోవడం జరిగింది.బుధవారం ఉదయం 7 :00 గంటల నుంచి 1:00 గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని అన్నారు.అనంతరం 2:00 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,పోలీస్ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,పాల్గొన్నారు.