
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 16
నాయకులతో మర్యాదపూర్వక భేటీ జహీరాబాద్ నియోజకవర్గం, మొగడంపల్లి మండల్ పరిధిలోని చిన్నబట్టి తాండ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన కేతావత్ గోవింద్ నాయక్ గెలుపు అనంతరం ప్రముఖ నాయకులు ఎన్. గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌కు వారు అభినందనలు తెలియజేసి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే గ్రామ ప్రజల ఆశయాలను నెరవేర్చేలా సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ మర్యాదపూర్వక సమావేశంలో ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సభ్యులు కూడా పాల్గొని నాయకులను కలిశారు. చిన్నబట్టి తాండ గ్రామ అభివృద్ధి దిశగా కొత్త పాలనతో ముందుకు సాగుతామని సర్పంచ్ గోవింద్ నాయక్ ఈ సందర్భంగా తెలిపా రూ