
ఎన్నికల సామాగ్రితో… గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది
మద్నూర్ డిసెంబర్ 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రామపంచాయతీ మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రమును తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎన్నికల అధికారి సిహెచ్ సత్యనారాయణ రెడ్డి మరియు అదనపు కలెక్టర్ వి విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్ మై ,అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మరియు ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ రవి తేజ పరిశీలించారు అనంతరం మద్నూర్ మండలానికి మొత్తం ఎన్నికల సిబ్బంది 646, పోలీస్ సిబ్బంది 150 మందికి విధులు కేటాయించారు మొత్తం పోలింగ్ కేంద్రాలు 186 ఉన్నాయి, ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రితో గ్రామాలకు తరలి వెళ్లారు అధికారులతో పాటు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో డి సి ఓ రామ్మోహన్ రావు మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ ఎంపీడీవో రాణి, ఎంపీ ఓ వెంకట్ నర్సయ్య పాల్గొన్నారు
