
జనం న్యూస్ ;డిసెంబర్ 16 మంగళవారం;సిద్ధిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
హైదరాబాద్లోని భారత్పుర కాలనీలో కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. జనార్దన్ కాలనీకి వచ్చి దాదాపు 45 మంది పేషెంట్లకు పరీక్షలు చేసి తగిన మందులు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు డాక్టర్ కు సన్మానం చేశారు. కాలనీ ప్రజలందరి తరపున డాక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, సెక్రటరీ లక్ష్మీకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పద్మ కమిటీ సభ్యులు ధనరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.