
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 26పై లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో ఈ బస్సు మరో బస్సును, ఓ బైకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకర్‌తో సహా బస్సులోని మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.