
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డి.పి.టి.సి) మరియు విజయనగరం 5వ బెటాలియన్లో బిటిసిలను విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి డిసెంబర్ 16న సందర్శించి, పోలీసు కానిస్టేబుళ్ళ శిక్షణకు కావాల్సిన ఏర్పాట్లు, మౌళిక వసతులను పరిశీలించారు. విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి. గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ - సారిపల్లిలో గల డి.పి.టి.సి. మరియు విజయనగరం 5వ బెటాలియన్లో బిటిసిలలో ట్రైనీ కానిస్టేబుళ్ళుకు క్రమశిక్షణతో కూడిన శిక్షణను అందించేందుకు కావాల్సిన మౌళిక వసతులు అన్ని సిద్దం చేశామన్నారు. శిక్షణా కేంద్రాలకు పోలీసు శిక్షణ నిమిత్తం త్వరలో శిక్షణ కానిస్టేబుళ్ళు రానున్నారన్నారు. శిక్షణకు వచ్చే కానిస్టేబుళ్ళుకు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ శిక్షణను అందించేందుకు అన్ని చర్యలను చేపట్టామన్నారు. శిక్షణార్థులు శిక్షణ కేంద్రంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశామన్నారు. శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, కార్యాలయం, వంట గది, డైనింగు హాలు, స్టోరు రూం, వాష్ రూంలను, స్నానపు గదులను, మినరల్ వాటర్ ప్లాంట్, పరేడ్ గ్రౌండు, కంప్యూటరు ల్యాబ్, ఫైరింగు రేంజ్ లను విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి. స్వయంగా పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో మంచాలు, పరుపులు, క్రీడా సామగ్రి, టేబుల్స్, కంప్యూటర్లు, ఫ్యానులను జిల్లా ఎస్పీ పరిశీలించారు. వంటశాలను, డైనింగు హాలును పరిశీలించి, వంట గది, డైనింగు హాలు పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, శిక్షణ ఇచ్చేందుకు నియమించబడిన పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు చేసారు. శిక్షణ కానిస్టేబుళ్ళును సుశిక్షులను చేసేందుకు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ శిక్షణను అందించాలన్నారు.విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ వెంట అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, 5వ బెటాలియన్ అడిషనల్ కామాండంట్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, డిపిటిసి డిఎస్పీ ఎం. వీరకుమార్, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, పలువురు సిఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.