
జుక్కల్ డిసెంబర్ 17 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోంగావ్ గ్రామంలో తన స్వంత ఊరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని, ఓటు హక్కును వినియోగించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ,ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించి, తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.తన జన్మభూమిలో ఓటు వేయడం ఎంతో గర్వకారణమని పేర్కొంటూ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాజకీయ జీవితంలో ముందుకు సాగగలిగానని అన్నారు.

